టీజర్ తో అదరగొడుతున్న బంగార్రాజు..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

బంగార్రాజు.. ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూశారు.. అయితే ఆ సమయం రానే వచ్చేసింది. ఈరోజు అనగా నవంబర్ 23 వ తేదీన నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా బంగార్రాజు సినిమా నుంచి లేటెస్ట్ గా టీజర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో బంగార్రాజు గా నాగచైతన్య నటిస్తూ ఉండడం గమనార్హం.

సోగ్గాడే చిన్నినాయన సినిమాలో బంగార్రాజు గా నాగార్జున నటించి అలరించిన విషయం తెలిసిందే. ఇక బంగార్రాజు సినిమాల్లో కూడా నాగార్జున బంగార్రాజు గా నటిస్తారు అని అందరూ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ సారి బంగార్రాజు గా నాగచైతన్య దర్శనం ఇవ్వడం గమనార్హం. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున ఎలా అయితే నటించాడో..బంగార్రాజు సినిమాలో నాగచైతన్య కూడా అదే పాత్రలో నటిస్తూ మెప్పించడానికి సిద్ధమవుతూ ఉండడం గమనార్హం. చేతికి కడియం, మెడలో గొలుసు, కళ్లకు అద్దాలు.. మీసం మెలేసుకుంటూ వచ్చి కర్ర విసరగానే వెళ్ళి తన బుల్లెట్ బైక్ లో కూర్చోవడం..ఇలా ప్రతిదీ తండ్రికి తగ్గట్టుగా.. ఏ మాత్రం లోపం లేకుండా నాగచైతన్య నటించడం గమనార్హం. ప్రస్తుతం ఈ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

Share.