ఏపీ సీఎం -చంద్రబాబులపై షాకింగ్ వీడియో విడుదల చేసిన RGV..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో వివాదాలకు పెట్టింది పేరు రాంగోపాల్ వర్మ. ఈయన ఎటువంటి విషయం పైనైనా తనదైన శైలిలో స్పందిస్తూ.. అందుకు సంబంధించిన పోస్ట్ లు చేస్తూ ఉంటాడు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు ఏడవడం మీద కూడా కొన్ని కామెంట్ చేశాడు. అయితే ఈ రోజున అందుకు సంబంధించి ఒక వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్ ద్వారా” ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ రియల్ మ్యాన్ అండ్ రీల్ మాన్”అంటూ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. అందులో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఒక సంఘటనలో జరిగిన రెండు వీడియోలను అటాచ్ చేసి విడుదల చేశాడు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని రియల్ లీడర్ గా పోలుస్తూ.. చంద్రబాబును రిల్ లీడర్ గా వీడియో సెట్ చేసి విడుదల చేశాడు. అయితే తే ఈ వీడియో పై అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Share.