గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్..ఆలస్యం వెనుక అసలు కథ ఇదేనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో గొప్పగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు ఇతర పౌర సేవలను సులభంగా ప్రజలకు అందించడానికి ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 20 వేల మందిని ఉద్యోగులు గా నియమించారు. వీరికి రెండేళ్ల ప్రొబేషన్ పీరియడ్ అమలు చేసి, ఆ తర్వాత ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తామని , జీతాలు కూడా పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది..

అయితే ఉద్యోగుల ప్రొబేషన్ పూర్తయి దాదాపు రెండు నెలలు కావస్తోంది. సెప్టెంబర్ నెలాఖరులో అందరికీ పరీక్షలు నిర్వహించి , ఉత్తీర్ణులైన వారికి ప్రొబేషన్ పూర్తిచేసినట్లు ధ్రువీకరించి, ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని.. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి మరొక అవకాశం కల్పిస్తామని కూడా ప్రభుత్వం తెలిపింది.. కానీ ఇప్పటివరకు ఎలాంటి ఆచూకి తెలియడం లేదు.

ఇందుకు కారణం గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా రెగ్యులరైజ్ చేస్తే సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన అన్ని బెనిఫిట్స్ ను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరు జీతం రూ. 15,000 ఇస్తుండగా వారికి రెగ్యులరైజ్ చేస్తే రూ.22 వేల నుంచి రూ.24 వేల వరకు పెంచాలి.అంతేకాదు సిపిఎస్, పిఎఫ్, హెల్త్ కార్డ్, కారుణ్య నియామకాలు ఇలా అదనపు సౌకర్యాలు కూడా కల్పించాల్సి ఉంటుంది. లక్షా ఇరవై వేల మందికి ఇవన్నీ బెనిఫిట్స్ కల్పించాలంటే ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది. ఇక ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా ప్రస్తుతం బాగా లేదనే చెప్పాలి.. వచ్చే ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత వీరి ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Share.