గూగుల్ లో కొత్త సదుపాయం.. వరదలు వస్తె ముందే కనుక్కోవచ్చా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ భారతీయ యూజర్ల కోసం,అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా గూగుల్ లోనే కోవిడ్ టీకాలను తీసుకునేందుకు స్లాట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అలాగే వివిధ భారతీయ భాషలకు సంబంధించి, దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన టూల్స్ ను ఏర్పాటు చేసింది. వాతావరణ విశేషాలు పై కూడా మరింత మెరుగైన సమాచారాన్ని అందించనుంది.

గూగుల్ సరి కొత్త అప్డేట్ ప్రకారం.. యూజర్లు కు 9 భారతీయ భాషల్లో గూగుల్ ద్వారా కోవిడ్ వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వచ్చే ఏడాది ఆరంభంలో అందిస్తుంది. ఇక గూగుల్ పే లో కూడా పలు మార్పులను తీసుకు వచ్చింది. వాయిస్ కామాండ్ల ద్వారా డబ్బులు ఇతరులకు పంపించే సదుపాయాన్ని కల్పించారు.

వీటితో పాటే వాతావరణ విశేషాలు ఇకపై గూగుల్ సెర్చ్ లో మరింత మెరుగ్గా తెలుస్తాయట. గూగుల్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తో భాగస్వామ్యం అయ్యింది. కనుక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ను తెలుసుకోవచ్చు. అలాగే స్థానిక వాతావరణ విశేషాలు కూడా తెలుసుకోవచ్చట. ఇక వరదలు వచ్చే అవకాశం ఉంటే.. వెంటనే చెప్పేస్తుంది. అలా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండొచ్చని భావించి ఇలాంటి సదుపాయాన్ని అనుకున్నట్లుగా గూగుల్ సంస్థ తెలిపింది.

Share.