ఎన్టీఆర్ షోలో మహేష్ బాబు.. షో డేట్ ప్రకటన విడుదల..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్టీఆర్, మహేష్ బాబు ఎవరు మీలో కోటీశ్వరుడు షో కి సంబంధించి టైమ్ అండ్ డేట్ ని కూడా ఫిక్స్ చేసింది జెమినీ టీవీ. ఇక అందుకు సంబంధించి ఒక పోస్టర్ ను కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఇక ఎన్టీఆర్ ఒకవైపు సినిమాల్లో బిజీగా ఉంటూ, జెమినీ టీవీలో ప్రసారమయ్యే మీలో ఎవరు కోటీశ్వరులు షో కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇక ఈ షోతో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ తో మహేష్ బాబు కలిసి ఈ షో కి సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. ఇక ఈ వీడియో ని ప్రసారం చేసేందుకు నిర్వాహకులు కూడా చాలా ఆతృతగా ఉన్నారు. ఇక వీరితో పాటు ఎన్టీఆర్, మహేష్ అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మొదటి రోజు రామ్ చరణ్ అతిధిగా వచ్చి 25 లక్షలు గెలుచుకున్నారు. ఇక ఆ తర్వాత రాజమౌళి, కొరటాల శివ , సమంత వంటి వారు 25 లక్షల రూపాయలు గెలుచుకున్నారు.

మహేష్ బాబు కూడా ఈ షోలో 25 లక్షలు గెలుచుకొని ఒక చారిటీకి ఇచ్చినట్లుగా సమాచారం. ఇక ఈ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు

Share.