చంద్రబాబు ఏడవడం పై.. షాకింగ్ వాక్యాలు చేసిన..RGV..!

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్నటి రోజున అసెంబ్లీ నుంచి వాకౌట్ అయ్యి, కంటతడి పెట్టుకున్న సంగతి తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. మళ్లీ తిరిగి సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టానని శపథం చేశారు. ఈ విషయంలో రాంగోపాల్ వర్మ ఎంటరై రచ్చరచ్చ చేశారు. చంద్రబాబు ఏడుపు పై రాజకీయ నాయకులు ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉండగా ఆర్జివి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు.

చంద్రబాబు నాయుడు కంటతడిని తన సినిమా ప్రమోషన్ గా మార్చుకున్నాడు రాంగోపాల్ వర్మ. తన సినిమా ట్రైలర్ ని చంద్రబాబు ఏడుపును జోడించి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఆర్జీవి. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో నుంచి ఒక వీడియో ని పోస్ట్ చేశాడు రాంగోపాల్ వర్మ. చంద్రబాబు ఏడవడానికి గల కారణం ఆర్జివి మిస్సింగ్ ట్రైలర్ అని చెప్పారు. ఇలాంటివి యాక్షన్ ఇచ్చినందుకు చంద్రబాబుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేశాడు ఆర్జివి. ఈ వీడియో చూసిన నెటిజన్ తమ తమ ఫీలింగ్స్ ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు.

Share.