చంద్రబాబు దుఖం పై.. సంచలన వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి తారక రామారావు మనవడు గా ఎన్టీఆర్ కి ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఇక తాత మాదిరే తను కూడా ఉంటారని చాలామంది సినీ ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చంద్రబాబు నాయుడు పై జరిగిన విషయం పై ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వీడియో వైరల్ గా మారుతోంది.

తాజాగా చంద్రబాబు నాయుడు భార్య పై చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నాడు. ఈ విషయం పై కొంతమంది సెలబ్రిటీలు సైతం ఈ స్పందించడం జరిగింది. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూమాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉండడం సర్వసాధారణం. విమర్శలు ప్రతి విమర్శలు ప్రజా సమస్యల మీద ఉండాలి కానీ, వ్యక్తిగత విషయాలపై ఉండకూడదు అంటు తెలియజేస్తున్నాడు.

నిన్న జరిగిన అసెంబ్లీ సంఘటన నా మనసును కలచి వేస్తోంది అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. ముఖ్యంగా ఆడపడుచుల విషయం లో అసభ్యకరమైన మాటలు మాట్లాడకూడదు. ఆడపడుచులను గౌరవించడం అనేది మన సంస్కృతి అని తెలియజేశాడు. ఒక తెలుగు పౌరుడిగా రాజకీయ నాయకుల అందరిని ఒకటే వేడుకుంటున్నాను.. ఇంతటితో ఈ అరాచకాన్ని ఆపండి అంటూ తెలియజేశాడు ఎన్టీఆర్.

Share.