కాలీఫ్లవర్ ట్రైలర్ తో అదరగొడుతున్న సంపూర్ణేష్ బాబు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

 హీరో సంపూర్ణేష్ బాబు విభిన్నమైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు. ఇక తాజాగా ఆయన నటిస్తున్న కాలిఫ్లవర్ సినిమాకు సంబంధించి ఒక ట్రైలర్ కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఇక ఈ ట్రైలర్ చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే.. ఈ ఊరిలో పుట్టే ఏ జంతువు కైనా ,మనిషికైనా ఒకటే భర్త ఒకటే భార్య అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సంపు మళ్లీ కాలీఫ్లవర్ రూపంలో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు..

సీలో రక్షిత రక్షితః అంటూ.. సమాజంలో అబ్బాయిల బారిన అమ్మాయిల పడుతుంటే, ఈ సినిమాలో అమ్మాయిల బారిన అబ్బాయిలు పడుతూ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో తెరకెక్కించిన ఈ సినిమా చాలా అద్భుతంగా ఉండబోతోంది అని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. అంతే కాదు ఊర్లో ఉండే వారి సీలాలను కాపాడే పెద్దమనిషిగా సంపు మనకు కనిపిస్తాడు. ఏది ఏమైనా సరికొత్త కథతో తెలుగు ప్రేక్షకులను కామెడీ రూపంలో అలరించడానికి సిద్ధమవుతున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇక ఈయన ఏ సినిమా తీసిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

Share.