బిగ్ బాస్ లో ఈసారి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వీరే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మన తెలుగు బుల్లితెరపై చాలా గ్రాండ్ గా ప్రసారమయ్యే రియాల్టీ షో ఏదంటే అది బిగ్ బాస్ షో అని చెప్పవచ్చు. ఇప్పటివరకు కొనసాగిన నాలుగు సీజన్లు కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఐదవ సీజన్ కూడా ఇదే బాటలో కొనసాగుతోంది. అలాగే ప్రతి వారం కూడా ఎలిమినేషన్ జరుగుతూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలా ఈవారం ఎలిమినేషన్ పై లేటెస్ట్ గా ఒక వార్త వినిపిస్తోంది.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో యాంకర్ రవి తప్ప మిగతా అంతా నామినేషన్ లో వున్నట్లు సమాచారం. అయితే ఇక ఇద్దరు కంటెస్టెంట్స్ తక్కువ ఓట్లతో లిస్టు లో ఉన్నారట. వారిలో కాజల్ , ఆని మాస్టర్ కూడా ఒకరు. ఇందులో ఆని మాస్టర్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరిలో ఎవరు బిగ్బాస్ హౌస్ నుంచి వైదొలుగుతారు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అయితే ఈ వారానికి సంబంధించి ఈ రోజు రాత్రి 9 గంటలకు వీడియో టెలికాస్ట్ కానుంది.

Share.