రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టిస్తున్న “ఆర్జీవి మిస్సింగ్” ట్రైలర్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

కాంట్రవర్సీకీ కేరాఫ్ అడ్రస్ గా మిగిలిన రామ్ గోపాల్ వర్మ.. ఏది చేసినా అది సంచలనమే అవుతుంది అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రామ్ గోపాల్ వర్మ తొలిసారిగా శివ సినిమాతో మాస్ డైరెక్టర్ గా గుర్తింపు పొంది, ఆ తరువాత రక్త చరిత్ర సినిమాతో సెన్సేషన్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తరువాత అన్ని అడాల్ట్ సినిమాలు తీస్తూ ఆ క్యాటగిరికే పరిమితమైన రామ్ గోపాల్ వర్మ, సరికొత్తగా మరోసారి రాజకీయ నాయకులకు ముచ్చెమటలు పట్టించేలాగా “ఆర్జీవీ మిస్సింగ్” అనే సినిమా తీయడానికి సిద్ధమయ్యాడు. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ వదలగా.. ఈ సినిమాలో రాజకీయాలలో ఉన్న ప్రతి ఒక్కరిని చూపిస్తూ .. ట్రైలర్ మరింత ఉత్కంఠగా సాగింది ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

ఇకపోతే బయోపిక్ సినిమాల నిర్మాణంలో రాంగోపాల్ వర్మ టేకింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రక్త చరిత్ర, కడప రెడ్లు, చంద్రబాబు వెన్నుపోటు పై సినిమాలు తీసిన రామ్ గోపాల్ వర్మ.. ప్రస్తుతం కొండా సురేఖ దంపతుల పై సినిమా తీయబోతున్నాడు. ఇప్పుడు ఆ సినిమాకు ప్రమోషన్స్‌ మొదలు పెట్టాడు. ఈ ట్రైలర్‌ ఏపీ పాలిటిక్స్‌ ను అందం పట్టేలా ఉంది. ముఖ్యంగా పవన్‌ కళ్యాణ్‌ ఓటమి, అలాగే చంద్రబాబు – లోకేష్‌ యవ్వరాన్ని కళ్లకు కటినట్లు చూపించాడు వర్మ. అలాగే.. వర్మను మెగా ఫ్యామిలీ, మాజీ సీఎం, అతడి కొడుకు , పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కిడ్నాప్‌ చేశారనే కోణంలో సినిమాను తీసినట్లు…. ఈ ట్రైలర్‌ చూస్తే మనకు అర్థమమౌవుతోంది.

Share.