వైరల్: నెట్టింట్లో వైరల్ అవుతున్న మెగాస్టార్ దయ్యం లుక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దెయ్యం లుక్ లో ఉన్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ లుక్ సినిమాకి సంబంధించింది అయితే కాదు.

హలో వీన్ డే సందర్భంగా అక్టోబర్ 31న సెలబ్రిటీలు చాలామంది ఫన్ మోడ్లో కోటి గెటప్స్ లో ఈ ఈవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా సరదాగా దెయ్యం లుక్ లో అలరించారు. దీనికి సంబంధించిన వీడియోను మెగాస్టార్
సరదాగా తన స్టోరీస్ లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ ను సర్ప్రైజ్ చేశారు. ‘హ్యాపీ హలో వీన్’ అంటూ విషెస్ తెలుపుతూ ‘ ఉత్కంఠ భరితమైన రోజు’ అని కామెంట్ చేశారు. అయితే ఈ దయ్యం లుక్ కోసం చిరు మేకప్ వేసుకోలేదు. జస్ట్ ఒక యాప్ ఉపయోగించి వీడియో చేశారు. ఈ వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా తెగ హల్చల్ చేస్తోంది.

అయితే తాజాగా మెగాస్టార్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన మూవీ ఆచార్య. ఈ మూవీ 2022 ఫిబ్రవరి 4న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. కాజల్ , పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ చిత్రీకరణ దశలో ఉంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో బోలా శంకర్ అనే చిత్రం కూడా త్వరలో ప్రారంభం కానుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమాలను చేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు.

Share.