‘1997’ నుంచి మోహన్ లుక్ విడుదల …!

Google+ Pinterest LinkedIn Tumblr +

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం 1997. ఇందులో నటుడు డాక్టర్ మోహన్ నటిస్తూ, స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ చంద్ర మరియు శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో వస్తున్న భిన్నమైన చిత్రం. ఈ చిత్రంలోని మూడు ముఖ్య పాత్రల్లో ఒకటైన నవీన్ చంద్ర లుక్ని యంగ్ హీరో విశ్వక్ సేన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం లోని మరో ముఖ్యమైన శ్రీకాంత్ అయ్యంగార్ లుక్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విడుదల చేసారు.

ఇప్పడు తాజాగా హీరో మోహన్ లుక్ ను నటుడు ప్రకాష్ రాజ్ విడుదల చేశారు. ఈ సందర్బంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ ఈ చిత్రంలోని కథ, పాటలు చూశానని చాలా బాగున్నాయని అన్నారు. మోహన్ కమిట్మెంట్, డెడికేషన్ కు ఆల్ ది బెస్ట్ చెప్తున్నానని, ఈ చిత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నారు. నటుడు డాక్టర్ మోహన్ మాట్లాడుతూ ఫస్ట్ లుక్ విడుదల చేసిన సందర్బంగా ప్రకాష్ రాజ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

Share.