నాన్నే బెస్ట్ టీచర్: మహేష్

Google+ Pinterest LinkedIn Tumblr +

సెప్టెంబర్ 5 అంటే గుర్తొచ్చేది గురుదినోత్సవం (టీచర్స్ డే). మన జీవితంలో మన గురువులని తలచుకొని, వారి వల్ల ఈ స్థాయికి వచ్చాం అని గుర్తించుకునే రోజు. అయితే గురు అంటే ఒక్క బడిలో పాఠాలు చెప్పేవారే కాదు జీవితంలో అనేక సార్లు చాలా మంది గురువులు ఎదురవుతారు. భారత దేశంలో తల్లితండ్రుల తరువాత గురువే మరో దైవం. తల్లితండ్రులు జన్మనిస్తే గురువు లోకజ్ఞానాన్ని ఇస్తారు. శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజుని ప్రత్యేకంగా జరుపుకుంటారు.

అయితే సూపర్ స్టార్ కూడా సోషల్ మీడియాలో ఒక ఫోటో పెట్టారు. తన గురువు దైవం అన్నీ మీరు అని సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి కృష్ణని ఉద్దేశించి అంటున్నారు. తన చిన్నప్పుడు తండ్రితో ఉన్న ఫోటోని పోస్ట్ చేసి తన జీవితంలో కరుణ, క్రమశిక్షణ, వినయం సమయానుగుణంగా బలంగా ఉండటం ఈదుతున్న ప్రతీ రోజు ఎంతో తనకి నేర్పించిన నా తండ్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని మహేష్ ఈ టీచర్స్ డే నాడు తెలిపారు. అలాగే తన ఈ జర్నీ లో తోడుగా ఉన్న ప్రతీ ఒక్కరికీ కూడా రుణపడి ఉంటానని మహేష్ అద్భుతమైన పోస్ట్ తో తెలిపారు.

Share.