“సీటీమార్” నుంచి మెగా అప్డేట్ అప్పుడేనా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరో గోపిచంద్ హీరో గా, సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటిమార్ ” నుంచి రేపు ఉదయం 10 గంటలకి ఒక మెగా అప్డేట్ ని ఇవ్వనున్నట్లు ఆ సినిమా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మణిశర్మ సంగీతం అందించగా , శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ చిత్రంలో ఇందులో మిల్కీ బ్యూటీ తమ్మన్నా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఈ నెల 10వ తేదీన రిలీజ్ కు సిద్ధంగా ఉంది. అయితే ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకోవాల్సి ఉండగా, ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానిస్తారేమో ననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశా రేపటి అప్డేట్ లో ఈ విషయాన్నే రివీల్ చేస్తారేమో అని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఏదీ ఏమైనా మెగా అప్డేట్ ఏంటో తెలుసు కోవాలంటే రేపటి వరకు వేచి ఉండాలి.

Share.