“బిగ్ బాస్ 5” షో ద్వారా మళ్ళీ నాగ్ రికార్డ్ బ్రేక్ అవుతుందా ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కింగ్ నాగార్జున తన రికార్డు ను తనే బ్రేక్ చేసే ఛాన్స్ వచ్చింది. బిగ్ బాస్ 5 మొదలుకానుంది. తెలుగు ఆడియన్స్ ఈ షో కి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సీసన్ భారీ అంచనాలే ఉన్నాయి. ఇంకొన్ని గంటల్లో మొదలుకానున్న షోని నాగార్జున హోస్ట్ చేయనున్నారు. గత రెండు సీజన్లను అద్భుతంగా హోస్ట్ చేసిన నాగ్ ఈసారి కూడా హోస్ట్ చేస్తుండడంతో ఎప్పుడు షో స్టార్ట్ అవుతుందా అని అందరు ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ కి ప్రతి సీసన్ కి ఆదరణ పెరుగుతూనే ఉంది.

అలానే నాగ్ హోస్ట్ చేసిన రెండు సార్లు మంచి టిఆర్పి వచ్చింది. గత సీజన్ కర్టెన్ రైజింగ్ ఎపిసోడ్ కి 18.5 టీఆర్పీ వచ్చింది. ఇప్పటికి అదే టాప్ లో ఉంది. అయితే ఇప్పుడు నాగ్ తన రికార్డు ను తనే బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరికొన్ని గంటల్లో షో మొదలుకానుంది.

Share.