అదిరిన బిగ్ బాస్ ప్రోమో.. ఈ సారి మరింత ఎంటర్ టైన్మెంట్..

Google+ Pinterest LinkedIn Tumblr +

‘బిగ్ బాస్-5’కు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఈ షో ఆదివారం నాడు ప్రారంభం కానుంది. నాగ్ గ్రాండ్ ఎంట్రీతో ఈ రియాలిటీ షో సాయంత్రం 6 గంటలకు ఆరంభం కానుంది. ఇప్పటికే మొద‌టి ఎపిసోడ్ షూటింగ్ పూర్త‌యింది. ఇది టెలికాస్ట్‌‌కు రెడీగా ఉంది. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోని హోటల్‌మారియట్ లో క్వారంటైన్‌‌లో పాల్గొనే వారు ఉన్నారు. శ‌నివారం నాడే ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

‘స్టార్ మా’ టీవీ ఈ సంద‌ర్భంగా ప్రోమో విడుదల చేసింది. దీంట్లో నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఈ సారి బిగ్ బాస్ హౌస్ గ్రీన్-పింక్ కలర్ లో భిన్నంగా ఉండ‌నున్న‌ది. అయితే ఇందులో బ్రిటీష్ కట్టడాలు క‌న‌ప‌డేలా సెట్ చేశారు. ఇంట్లోకి అడుగు పెట్టిన నాగార్జున మాట్లాడారు. టన్నుల కొద్ది కిక్కు ఉందంటూ అంచనాలు షో మీద పెంచేశారు. ఈరోజు సాయంత్రం కంటెస్టెంట్ల డ్యాన్సులతో షో పార్టిసిపెంట్స్ అంద‌రూ హోరెత్తించనున్నారు.

Share.