వినాయకుడు హీరో కృష్ణుడు అరెస్ట్.. ?

Google+ Pinterest LinkedIn Tumblr +

కామెడీ చేయడంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కామెడీ హీరో కృష్ణుడు గురించి మన అందరికి తెలిసిందే. మొదట్లో కామెడీ పాత్రల్లో నటిస్తూ ఒకటి రెండు సినిమాల్లో హీరోగా కూడా నటించాడు. విలేజ్‌లో వినాయకుడు, హ్యాపీడేస్, యువత, షాక్, ఆర్య2, జ్యోతి లక్ష్మి వంటి పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కృష్ణుడు.

తాజాగా అందిన సమాచారం ప్రకారం మన హీరో కృష్ణుడు పేకాట కేసులో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.అలాగే కృష్ణుడు తో పాటు మరో ఎనిమిది మందిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.ఎవరో గుర్తు తెలియని అఘాంతకుడు ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ మియపూర్ పోలీసులు చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి మరి శిల్పాపార్క్ విల్లాపై ఎటాక్ చేయగా పేకాట రాయుళ్ల బండారం బట్ట బయలు అయింది. నటుడు కృష్ణుడు తో పాటు ప్రధాన నిర్వాహకుడు పెద్ది రాజు సహా మొత్తం ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

Share.