మహేష్ కోసం ఏకంగా త్రివిక్రమ్ ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రిన్స్ మహేష్ బాబు ఏ సినిమాలు చేసిన బంపర్ హిట్టు కొట్టడం పక్కా. గతంలో ఆయన కెరీర్ లో ఫ్లాపులు ఉన్నప్పటికీ గత కొన్ని సంవత్సరాలుగా ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. మహేష్ బాబుకు త్రివిక్రమ్ కు మంచి స్టార్ డమ్ ఉంది. వీరిద్దరూ ఏ సినిమా చేసినా కూడా ఫ్యాన్స్ విపరీతంగా ఆదరిస్తారు. మరిప్పుడు ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఆ సినిమాలో మహేష్ కు జోడిగా పూజా హెగ్దే జత కట్టనుంది. ఆమెతో పాటుగా ఇంకో హీరోయిన్ కూడా ఉంది.

నభా నటేష్ ను మరో హీరోయిన్ గా త్రివిక్రమ్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఈ హాట్ హీరోయిన్ ఈ మధ్యకాలంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. అతి తక్కువ కాలంలోనే ఈమె మహేష్ సరసన నటిస్తుండటంతో ఈ కెరీర్ గొప్ప టర్నింగ్ పాయింట్ అవుతుందని అంటున్నారు. మహేష్ బాబు ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాకనే త్రివిక్రమ్ సినిమా మొదలవ్వనుంది.

Share.