అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’కి కూడా డేట్ ఖరారు.!

Google+ Pinterest LinkedIn Tumblr +

కొవిడ్ నేపథ్యంలో చాలా కాలం పాటు సినిమాలు విడుదల కావడం వాయిదా పడుతూ వచ్చింది. కాగా, ఇప్పుడిప్పుడే మేకర్స్ ధైర్యం చేసి థియేటర్స్‌లో తమ మూవీస్‌ను విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం, తిమ్మరుసు’ వంటి చిత్రాలు విడుదల కాగా, త్వరలో ‘లవ్ స్టోరి’ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అక్కినేని అఖిల్ నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. డైరెక్టర్ ‘బొమ్మరిల్లు’ భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది.

కానీ, కరోనా మహమ్మారి వల్ల పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. అక్టోబర్ 8న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి సెన్సిబుల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ మ్యూజిక్ ఇవ్వగా, అఖిల్‌కు జోడీగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. హీరో నాగ చైతన్య ‘ఒక లైలా కోసం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు నాగచైతన్య తమ్ముడు అఖిల్ సినిమాలో హీరోయిన్‌గా మెరవనుంది.

Share.