షూటింగ్‌లో గాయపడ్డ గ్లోబల్‌ స్టార్‌..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ దేశీ గర్ల్ గా, హాలీవుడ్ నటిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంక్ చోప్రా.. భారత్ తో పాటు విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకుని గ్లోబల్ స్టార్ గా ఎదిగింది. తర్వాత అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా బెస్ట్ జోడీగా ఈ జంట కితాబునందుకుంది. పెళ్లి తర్వాత ప్రియాంక అమెరికాలోనే ఎక్కవగా ఉంటుంది.

ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా షూటింగ్ లో గాయపడింది. ప్రియాంక చోప్రా నటిస్తున్న ‘సిటాడెల్’ ఎపిసోడ్ చిత్రీకరణ లండన్ లో జరుగుతోంది. షూటింగ్ సమయంలో ప్రియాంక చోప్రాకు గాయాలయ్యాయి. ఆమె గాయపడిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. మొహం మీద మట్టీ, నుదురు, చెంపలపై ఉన్న రక్తపు గాయాలకు సంబంధించిన ఫొటోలను ప్రియాంక తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ప్రియాంకకు అయిన ఈ గాయాలు తీవ్రంగా ఉండటంతో ఆమె ఫ్యాన్స్ కంగారు పడుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇది నిజంగా జరిగిన ప్రమాదమా లేక షూటింగ్ భాగంగా పెట్టినవా అని ఆరాతీస్తున్నారు.

Share.