డెలివరీ బాయ్‌గా మాజీ ఐటీ మంత్రి…?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆఫ్ఘనిస్తాన్‌ దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకున్న తరుణంలో అక్కడ ప్రజలు నానా తిప్పలు పడుతున్న విషయం తెలిసిందే. బతుకు జీవుడా అనుకుంటూ ఆ దేశాన్ని వదిలి పారిపోతున్నారు.ఏకంగా తాలిబన్ల నుంచి రక్షణ పొందడానికి ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ సైతం ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు.

ఆయనతో పాటు కొంతమంది నేతలు కూడా దేశం విడిచి పరారరయినా విషయం తెలిసిందే. ఇంకా అక్కడి ప్రజల గురించి చెప్పక్కర్లేదు.
ఇదిలా ఉండగా కొంత కాలం క్రితం ఆఫ్ఘన్ దేశానికీ ఐటీ మంత్రిగా పనిచేసిన సయ్యద్ అహ్మద్ షా సాఅదత్ అప్పట్లో ఆఫ్ఘన్ అధ్యక్షుడు ఘనీతో పొంతన కుదరకపోవడంతో ఐటీ మంత్రి పదవికి రాజీనామా చేసి ఆఫ్ఘన్ దేశాన్ని విడిచి జర్మనీ వెళ్ళిపోయాడు. ప్రస్తుతము ఆయన దగ్గర ఉన్న మనీ అంతా ఖర్చు అవటంతో చేసేది లేక లీప్‌జిగ్ సిటీలోని ఒక పిజ్టా కంపనీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవినాన్ని కొన సాగిస్తున్నాడు.బ్రతకడం కోసం ఇలా పిజ్జా బాయ్ గా పనిచేయడంలో తప్పు ఏమి లేదని అంటున్నాడు ఆఫ్ఘన్ దేశ మాజీ ఐటీ మంత్రి సాఅదత్‌. మాజీ మంత్రే ఇన్నీ తిప్పలు పడుతుంటే మరి ఆఫ్ఘన్ దేశం వదిలి వలస వెళ్లిన సామాన్య ప్రజలు ఇంకెన్ని ఇబ్బందులు పడతారో మరి. !

Share.