జగన్ బెయిల్ రద్దు తీర్పు వాయిదా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

సీఎం జగన్ కు సంబంధించిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు అందరిలో ఒకింత ఆందోళన మొదలయిందనే చెప్పాలి.సీబీఐ కోర్టు జగన్ కు ఎటువంటి తీర్పు ఇస్తుందో అని ఇటు జగన్ మోహన్ రెడ్డితో పాటు వైసీపీ పార్టీ నేతల్లో కూడా అలజడి మొదలయిందని చెప్పాలి. ఈ క్రమంలో బుధవారం రోజు అంటే ఈరోజున సీబీఐ కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను పరిశీలించి తీర్పు ఇవ్వనుంది.

 

భిన్న వాదనల మధ్య కోర్టు తమ నేతకు ఎలాంటి తీర్పు ఇస్తుందో అని వైసీపీ శ్రేణులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రమంలో జగన్ కు అనుకూలంగానే కోర్టు స్పందించడం పట్ల హర్షం వ్యక్తం చేసారు వైసీపీ వర్గాలు. అయితే జగన్ కు పూర్తిగా రిలీఫ్ రాలేదు. కేవలం ఈ కేసును సెప్టెంబర్ 15 వరకు మాత్రమే వాయిదా వేసింది.అలాగే ఈరోజు జగన్ పిటిషన్‌తో పాటు వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్‌ కూడా విచారణ జరగగా అది కూడా వాయిదా పడడంతో వైసీపీ పార్టీ నేతల్లో కాస్త ఆందోళన తగ్గిందని చెప్పవచ్చు.

Share.