హీరో సూర్య మరో రికార్డు…?

Google+ Pinterest LinkedIn Tumblr +

సౌత్ ఇండియాలో హీరో సూర్యకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా సూర్య ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తాజాగా ఆయన ఆకాశం నీ హద్దురా సినిమాతో మరో సక్సెస్ ను నమోదు చేశారు. సూర్యకి తెలుగు చలన చిత్ర పరిశ్రమతో అనుబంధం ఉంది. సీఎం జగన్, హీరో సూర్యలు స్నేహితులు. తెలుగు ప్రేక్షకులే కాదు దేశ వ్యాప్తంగా యువత సూర్య సినిమాలను బాగా ఇష్టపడతారు.

మరి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య మరో రికార్డును సాధించారు. సూర్య ట్విట్టర్ అకౌంట్ ను 70 లక్షల మంది ఫాలోవర్స్ చేరిపోయి సూర్యపై ఎనలేని అభిమానం ఉందని చాటి చెప్పారు. కేవలం ఆరు సంవత్సరాలలోనే సూర్య ఈ రికార్డును సాధించారు. సౌత్ ఇండియాలో సూర్య రికార్డును మరే హీరో కూడా ఇప్పటి వరకూ సాధించలేదు. ఫాస్టెస్ట్ 7 మిలియన్ ఫ్యామిలీ రికార్డును సూర్య సాధించడంతో ఆయన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన “జై భీం” సినిమా ప్రైమ్ వీడియోలో విడుదల అవ్వడానికి సిద్దంగా ఉంది.

Share.