నాన్న సినిమా కోసం చరణ్ ఎంట్రీ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల కాలంలో సినిమాల విడుదల కంటే చాలా ముందు నుంచే మూవీ యూనిట్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. ఈ క్రమంలోనే ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కాగా, తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆ సినిమా కాకుండా తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి సినిమా ప్రమోషన్ చేశాడు. ఎక్కడంటే..తారక్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రాంలో చెర్రీ పాల్గొన్నాడు. స్పెషల్ గెస్ట్‌గా వచ్చిన చెర్రీతో తారక్ సరదాగా ముచ్చటించాడు. ఫుల్ ఎంటర్‌టైనింగ్ వేలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పలు విషయాలు పంచుకున్నారు. ఈ క్రమంలోనే చరణ్ ‘ఆచార్య’ విశేషాలను హైలైట్ చేశాడు.

గురువు అనే అర్థం వచ్చే పదం ఏది? అనే క్వశ్చన్ వేసి పలు ఆప్షన్స్ ఇచ్చాడు తారక్. అందులో ‘ఆచార్య’ అనే పదం ఉండగా, వెంటనే ఆ టైటిల్ కన్ఫర్మ్ చేశాడు చరణ్. దాంతో ‘ఆచార్య’ చిత్రం గురించి పలు విషయాలు పంచుకున్నాడు రామ్ చరణ్. కాగా, ఈ షో కోసం నాన్న కోసం తనయుడు ప్రమోషన్స్‌లో పాల్గొన్నట్లుంది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ‘ఆచార్య’ చిత్రంలో రామ్ చరణ్ తేజ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. త్వరలో ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.

Share.