టాలీవుడ్ నుంచి అధికంగా ట్వీట్ చేయబడిన హ్యాష్ ట్యాగ్స్ ఏవంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

సెలబ్రిటీలకు ఒకప్పుడు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత ఉన్నది అని తెలిసేందుకు వారు నిర్వహించే సినిమా ఫంక్షన్స్‌కు హాజరయ్యే జనాలను బట్టి అంచనా వేశేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. డిజిటల్ వరల్డ్‌లో సోషల్ మీడియా ప్రపంచంలో ఉన్న మనం హీరోల గురించి ట్వీట్స్ చేయడం, పోస్టులు పెట్టడం కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్లస్ సౌత్ స్టార్ హీరోలకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఏర్పడింది. కాగా, ఈ ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి జూన్ 30 వ తేదీ వరకు భారత దేశంలో ఎక్కువగా ట్వీట్స్ చేయబడిన హ్యాష్‌ట్యాగ్స్‌లలో సౌత్ నుంచి ఎక్కువ మంది హీరోలకు సంబంధించిన ట్వీట్స్ ఉండటం విశేషం. అందులో టాప్ ప్లేస్‌లో కోలీవుడ్ హీరో తాలా అజిత్ మూవీ ‘వాలిమై’ ఉండగా, సెకండ్ ప్లేస్‌లో ఇళయ దళపతి విజయ్ చిత్రం ‘మాస్టర్’ ఉంది. మూడో హ్యాష్ ట్యాగ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫిల్మ్ ‘సర్కారు వారి పాట’ ఉండటం విశేషం.

నాల్గో ట్వీట్‌గా హీరో అజిత్ కుమార్ హ్యాష్ ట్యాగ్ ఉండగా, ఐదో హ్యాష్ ట్యాగ్‌గా దళపతి65 ఉంది. ఇక పదో స్థానంలో జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ఫిల్మ్ టైటిల్ ఉంది.

Share.