సీక్రెట్‌గా హీరో కార్తికేయ నిశ్చితార్థం..?

Google+ Pinterest LinkedIn Tumblr +

అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘ఆర్‌ఎక్స్ 100’ ఫిల్మ్‌తో హీరోగా తనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కార్తీకేయ. కాగా, ఈ హీరోలో త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్‌లో కుటుంబీకులతో అతి తక్కువ మంది రిలేటివ్స్, ఫ్రెండ్స్ మధ్య కార్తీకేయ్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకుకు చెందిన సెలబ్రిటీలు కొందరు హాజరయ్యారు. కార్తీకేయ పెళ్లి చేసుకోబోనే అమ్మాయి ఎవరు? ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండేనా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. కార్తీకేయ కెరీర్ విషయానికొస్తే. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఈ యంగ్ హీరోకు అంతస్థాయిలో హిట్ రాలేదు.

అయితే ఇటీవల విడుదలైన ‘చావు కబురు చల్లగా’ సినిమాలో ఆయనకు మంచి పేరొచ్చింది. ఈ ఫిల్మ్‌లో కార్తీకేయ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ లావణ్య త్రిపాటి నటించింది. ప్రస్తుతం కార్తీకేయ కోలీవుడ్ స్టార్ హీరో తాలా అజిత్ ‘వాలిమై’ చిత్రంలో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దాంతో పాటు తెలుగులో ‘రాజా విక్రమార్క’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Share.