”కేజీయఫ్ 2″ సౌత్ సాటిలైట్ హక్కులు ఆ సంస్థ సొంతం చేసుకుందా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూసే సినిమాల్లో కేజిఎఫ్ చాప్టర్ 2 కూడా ఒకటి. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సినిమా కేజిఎఫ్ పార్ట్ 2. కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల్లో యష్ కి ఉన్న క్రెజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో యష్ కి జోడిగా శ్రీనిధి శెట్టి నటిస్తుంది.

ఒకేసారి ఐదు భాషల్లో ఈ సినిమా తెరకెక్కడం విశేషం అనే చెప్పాలి. మరి అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే కేజిఎఫ్ సినిమా గురించి లేటెస్ట్ అప్డేట్ ను మేకర్స్ రివీల్ చేసారు. ఈ చిత్రానికి సంబంధించిన సౌత్ ఇండియన్ అన్ని భాషల శాటిలైట్ హక్కులను జీ సంస్థ వారు చేజికించుకున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఒక్క హిందీ బాష తప్పా తెలుగు, తమిళ్, మళయాళ, కన్నడ భాషల శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ వారు సొంతం చేసుకున్నారు. ఈ అధికారిక ప్రకటన చేయడం పట్ల యష్ కూడా సంతోషంగా ఉన్నారని తెలుస్తుంది. మరి హిందీ హక్కులు ఎవరు సొంతం చేసుకుంటారనే విషయం చూడాలి.. !

Share.