“పాగల్” ట్రైలర్ మీ కోసం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

హీరో విశ్వక్ సేన్ ఏ సినిమా చేసినా డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేస్తాడు. అందుకే యువత ఎక్కువగా విశ్వక్ సినిమాలను చూస్తుంటారు. ఈ యంగ్ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం పాగల్ అనే సినిమా చేస్తున్నాడు. యూత్ లో డిఫరెంట్ క్రేజ్ ను విశ్వక్ సేన్ సంపాదించుకోవడం వల్ల పాగల్ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మధ్యనే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ ను కూడా రిలీజ్ చేయడం జరిగింది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ అనేది రిలీజ్ అయ్యింది. ఇందులో విశ్వక్ కొంత స్టైలిష్ గా కనపడుతున్నాడు. రోొమియో లుక్స్ లో అదరగొడుతున్నాడు. ఈ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకునేలా ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ కు జోడీగా నివేతా పెత్తురాజ్ నటిస్తోంది. అంతేకాదు ఇందులో 1600 మంది అమ్మాయిలను ప్రేమించిన వ్యక్తిగా విశ్వక్ సేన్ అందర్నీ నవ్వించనున్నాడు. ఆగష్టు 14వ తేది సినిమా రిలీజ్ కానుంది.

 

 

<iframe width=”560″ height=”315″ src=”https://www.youtube.com/embed/muKsWufiTVs” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

Share.