ఓటిటి పై మహేష్ కామెంట్స్ వైరల్..?

Google+ Pinterest LinkedIn Tumblr +

కొవిడ్ మహమ్మారి ఎఫెక్ట్‌తో చాన్నాళ్ల పాటు థియేటర్స్ క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే మళ్లీ టాకీసులు ఓపెన్ అయ్యాయి. అయితే, కరోనా వల్ల జనాలు వినోదం కోసం ఓటీటీలను ఆశ్రయించగా, అవి కూడా బాగా పాపులర్ అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని సినిమాలు డైరెక్ట్‌గానే ఓటీటీ బాట పడుతున్నాయి. కాగా ఓటీటీపై తన అభిప్రాయాన్ని తెలిపారు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. తన సినిమాలు బిగ్ స్క్రీన్‌లో చూసేందుకు తెరకెక్కిస్తున్నవని, టాకీసుల్లో ప్రేక్షకులు వాటిని ఆస్వాదిస్తారని తెలిపారు. ప్రేక్షకులను, తన ఫ్యాన్స్‌ను థియేటర్ నుంచి వేరు చేయబోనని మహేశ్ చెప్పుకొచ్చారు.

అయితే, ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌పై తనకు రెస్పెక్ట్ ఉందని తెలిపారు. ప్రేక్షకులను థియేటర్లలోనే కలుస్తానని ఒప్పందం ఉందని చెప్పారు ప్రిన్స్ మహేశ్. ప్రస్తుతం మహేశ్ ‘గీతా గోవిందం’ ఫేమ్ డైరెక్టర్ పరశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ చిత్రం చేస్తున్నారు. ఈ ఫిల్మ్‌లో మహేశ్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ కీర్తి సురేశ్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతున్నది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదల కాగా, అందులో మహేశ్ లుక్స్ చూసి ప్రేక్షకులు, అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. సినిమా హిట్ గ్యారంటీ అని అంటున్నారు.

Share.