బ్లాంక్ చెక్ ఇచ్చి మరి రష్మికని ఒప్పించారట..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కన్నడలో ఏ ముహుర్తాన కిరాక్ పార్టీ సినిమా చేసిందో కాని ఆ సినిమాతో అక్కడ ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగి తెలుగులో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా వరుస స్టార్ అవకాశాలను అందుకుంటుంది రష్మిక మందన్న. రీసెంట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు భీష్మ సినిమాతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఛలో సినిమాను ఎలా ఒప్పుకుంద్ డైరక్టర్ వెంకీ కుడుముల వివరించారు. కిరాక్ పార్టీ సినిమా చూసి నా సినిమాలో ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాను అందుకే బెంగుళూరు వెళ్లి ఆమెకు కథ చెప్పాను. కథ విన్న తర్వాత సరే చూద్దాం అంటుందేమో అని బ్లాంక్ చెక్ రష్మిక మదర్ కు ఇచ్చామని అన్నాడు వెంకీ. అందులో మీరెంతైనా రాసుకోండని చెప్పాడట.

అలా ఛలో కోసం పాతిక లక్షల రెమ్యునరేషన్ తీసుకుని రష్మిక ఆ సినిమా చేసింది. ఫైనల్ గా ఛలో, గీతా గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు ఐదు సినిమాలకే రష్మిక స్టార్ ఇమేజ్ ఏర్పరచుకుంది. భీష్మ రిలీజ్ తర్వాత ఎన్.టి.ఆర్ తారక్ సినిమాతో పాటుగా సుకుమార్, బన్ని సినిమాలో కూడా ఆమె నటిస్తుందని ఫిల్మ్ నగర్ టాక్.

Share.