రూల్స్‌బ్రేక్ చేయ‌బోతున్న నాని `వి`తో బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్ర‌స్తుతం అంతా మల్టీస్టారర్ మూవీస్ హ‌వా న‌డుస్తుంది. ఈ నేపథ్యంలో నాని, సుధీర్ బాబు నటించిన `వి` మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. గత కొంత కాలంగా టాలీవుడ్ లో మల్టీ స్టారర్ మూవీస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతో ఆర్ఆర్ఆర్ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వీ మూవీలో అందరినీ కాపాడే పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో హీరో సుధీర్‌బాబు నటిస్తున్నారు. అలాగే ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో నేచ‌ర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్నారు. ఇటీవల వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్‌ ఇప్పుడు టీజ‌ర్‌ను విడుద‌ల చేసింది.

‘వి’ మూవీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. నానితో అష్టాచమ్మ, జెంటిల్‌మన్‌..సుధీర్‌ సమ్మోహనం వంటి విజయవంతమైన సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్‌ మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నారు. హిట్‌ సినిమా ల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ నిర్మాణంలో శిరీష్‌, హర్షిత్‌ రెడ్డి ఈ మూవీ నిర్మిస్తున్నారు. అలాగే సినిమాను ఉగాది సందర్భంగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు. ఈమూవీపై అటు సుధీర్ బాబు, నాని కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఈ టీజ‌ర్లో ముందు సుధీర్‌బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా టీజ‌ర్ మొద‌ల‌వుద్ది. ఫూల్స్ మాత్ర‌మే రూల్స్ గుడ్డిగా ఫాలో అవుతారు సార్‌. అప్పుడ‌ప్పుడు నాలాంటివాడు కొద్దిగా రూల్స్ బ్రేక్ చేస్తూ ఉంటాడు. అంతే అంటూ చెప్పే ఈ డైలాగ్ సూప‌ర్బ్‌గా ఉంటుంది. ఇక నాని విష‌యానికి వ‌చ్చేస‌రికి విల‌న్ అయినా స‌రే చాలా సూప‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. ఇందులో నాని, సుధీర్ చెప్పే డైలాగ్స్ సూప‌ర్బ్‌గా ఉన్నాయి. టీజ‌ర్‌తోనే సినిమా ఎప్పుడు చూడాలా అన్న‌ట్లు క‌ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. చివ‌ర‌గా నాని ఇందులో చెప్పే డైలాగ్ సుధీర్‌… ఏంట్రా గేమ్స్ ఆడుతున్నావ్ అంటే నాని సోదాపు ద‌మ్ముంటే న‌న్నుఆపు అనే డైలాగ్ టీజ‌ర్ మొత్తంలో హైలెట్‌గా క‌న‌ప‌డుతుంది.

Share.