జాన్వి పెళ్ళి పై బోనీక‌పూర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు?

Google+ Pinterest LinkedIn Tumblr +

దివంగ‌త న‌టి శ్రీ‌దేవి కూతురు జాన్వి క‌పూర్. జాన్వి శ్రీ‌దేవికి ముద్దుల కూతుర‌న్న విష‌యం అంద‌రికి తెలిసిందే. అయితే ఈ భామ త‌న త‌ల్లి శ్రీ‌దేవి ఉండ‌గానే సినిమాల్లోకి తీసుకురావాల‌ని చాలా గ‌ట్టిగా ప్ర‌య‌త్నించింది. ఎందోగాని అప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌లేక‌పోయింది. శ్రీ‌దేవి చనిపోయిన త‌ర్వాతే జాన్వి ధ‌డ‌క్ చిత్రంలో న‌టించ‌డం జ‌రిగింది. పాపం శ్రీ‌దేవి ఉంటే చాలా ఆనంద‌ప‌డేది. ఇక ఇదిలా ఉంటే… ఇక సెల‌బ్రెటీల ఇళ్ళ‌ల్లో పార్టీలు, ల‌వ్‌లు, బ్రేక‌ప్‌లు ఇవన్నీ కామ‌న్ అన్న విష‌యం అంద‌రికి తెలిసిందే. ఓసారి త‌ల్లి శ్రీ‌దేవి ఉండ‌గానే ముంబైలో ఓ పార్టీలో జన్వి, ఆ వ్యక్తితో రామాన్స్ చేస్తూ తన్మయత్వంలో మునిగిపోతుండగా ఓ ఫొటోగ్రాఫర్ ఫొటోని తీసి అందులో బంధించాడు. అయితే ఆ యువకుడు కూడా తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఆ చిత్రాలను పోస్ట్ చేశాడు కూడా. orry1 పేరుతో అకౌంట్‌లో ఈ ఫొటో లభ్యమైంది. స్టార్ల కూతుర్లతో డేరింగ్ డేటింగ్, రొమాన్స్ చేస్తూ ఉన్న వ్యక్తిని ఒర్హాన్ అవత్రామణి అని గుర్తించారు. కేవలం వీరితోనే కాకుండా బాలీవుడ్ హీరోయిన్లతో పలువురు మహిళా సెలబ్రిటీలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఈ యువకుడు కనిపించడం అందర్ని ఆశ్చర్యపర్తుస్తున్నది.

ఇక జాన్వి అప్ప‌ట్లో ఓ అబ్బాయితో తిరిగేద‌ని తెగ పుకార్లు షికార్లు చేసేవి. అయితే ఇటీవ‌లె మ‌ళ్ళీ ఒక‌సారి ఆ గాసిప్ గుప్పుమ‌నింది. ఓ వెబ్‌సైట్‌లో జాన్వి ప‌బ్లిక్‌గా ఆ అబ్బ‌యితో తిరుగుతంద‌ని అత‌నితో ప్రేమ‌లో వార్త రాయ‌డంతో తండ్రి బోనీక‌పూర్ ఎప్పుడూ మాట్లాడ‌ని ఆయ‌న నిన్న దీని పై స్పందించిన‌ట్లు స‌మాచారం. అవును నిజ‌మే మీరనుకునేది క‌రెక్టే మీరు రాసింది అక్ష‌రాల వంద‌కి వంద‌శాతం క‌రెక్ట్ అని నేను ఇప్పుడు అనాలా. అంటే జాన్వి అత‌డితో తిరుగుతుంది. ప్రేమ‌లో ప‌డింది. పెళ్ళి కూడా అత‌న్నే చేసుకుంటుంది అని నేను చెప్పాలి అదే క‌దా మీకు కావ‌లసింది అదేక‌దా. మీరు రాసుకోవ‌ల‌సింది అదేక‌దా రాసుకోండి. అయినా ఒక అమ్మాయికి స్వేచ్ఛ‌గా తిరిగే ఇది లేదా. అత‌ను ఆమె ఫ్రెండ్‌. ఇట్లా ఎప్పుడూ కూడా మా ఇన్‌ఫ‌ర్మేష‌న్ లేకుండా న్యూస్‌ని స్పెర్డ్ చేయ‌వ‌ద్దు అని ఆయ‌న మీడియాకి వార్నింగ్ ఇచ్చారు.

Share.