నితిన్ చేసుకోబోయే అమ్మాయి ఫొటో లీక్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ హీరోల్లో మోస్ట్ బ్యాచిల‌ర్స్‌లో నితిన్ ఒక‌ర‌ని చెప్ప‌వ‌చ్చు. కెరియ‌ర్ మంచి ఫాంలో ఉన్న ఈ యంగ్ హీరో ఇప్ప‌టి వ‌ర‌కు పెళ్ళి మీద మాత్రం దృష్టి సారించ‌లేదు. అయితే ఈ ఏడాది ఎలాగైనా స‌రే పెళ్ళి చేసుకోవాల‌ని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడు ఈ హీరో.

ఇప్పటికే నితిన్‌ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. అయితే ఈ శనివారం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య నితిన్‌ ఎంగేజ్‌మెంట్ జరగనుందన్నటాక్ కూడా వినిపిస్తోంది. అయితే నితిన్‌ నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు.

నితిన్‌ చేసుకోబోయే అమ్మాయికి సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే బయటకు వచ్చాయి. ఎంబీఏ గ్రాడ్యూయేట్‌ అయిన షాలినినీ నితిన్‌ వివాహం చేసుకోబోతున్నాడు. ఇటీవల టాలీవుడ్‌ సెలబ్రిటీ లందరూ తమ వివాహాలను డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో చేసుకుంటున్నారు. ఇక నితిన్ కూడా తన వివాహానికి అలాంటి ఏర్పాట్లే చేస్తున్నాడ‌ని స‌మాచారం. ఇప్పటికే నితిన్‌ షాలినీలా వివాహానికి ముహూర్తం, వేదిక కూడా ఫిక్స్‌ అయ్యింది.

వివాహ‌తేదీ ఏప్రిల్ 16న దుబాయ్‌లో వివాహం జ‌ర‌గ‌నుంది. పెళ్ళికి మాత్రం చాలా సింపుల్‌గా అతిథుల‌ను పిల‌వాల‌ని ఫిక్స్ అయ్యార‌ట‌. పెళ్లి అనేది పూర్తిగా ప్రైవేట్‌ వ్యవహారం అని భావిస్తున్న సెలబ్రిటీలు.. కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్యే ఈ వేడుకను జరుపుకోవాలని భావిస్తున్నారు. అయితే సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయ‌నున్నారు. అయితే తాజాగా నితిన్‌ చేసుకోబోయే అమ్మాయి ఫోటో కూడా బయటకు వచ్చింది. హీరోయిన్‌ లా కనిపిస్తున్న షాలినిని చూసి నితిన్‌ ఫ్యాన్స్‌ తమ హీరోకి తగిన జోడి దొరికిందంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

ప్ర‌స్తుతం నితిన్ ర‌ష్మిక‌తో క‌లిసి భీష్మ్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఛ‌లో ఫేం వెంకీ కుడుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌తోంది. ఆ త‌రువాత చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి ద‌ర్శ‌క‌త్వంలో ఇంకా రెండు మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఒక ర‌కంగా నితిన్ ఫుల్ బిజీ అనే చెప్పాలి.

Share.