ముద్దులతో రెచ్చిపోతున్న షార్ట్ ఫిల్మ్ హీరోయిన్.. వెబ్ సీరీస్ లకే ఇలా చేస్తే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అల్లు అరవింద్ కొత్తగా డిజిటల్ ఫ్లాట్ ఫాం లోకి వచ్చిన విషయం తెలిసిందే. అహా ఓటిటి లాంచింగ్ వేడుకలో ఈ ప్లాట్ ఫాం నుండి అందరికి ఆహ్వానమని అన్నారు అల్లు అరవింద్. ఇక మొదటి వెబ్ సీరీస్ ట్రైలర్ తో సర్ ప్రైజ్ చేశారు. క్రిష్ నిర్మాణంలో వచ్చిన మస్తి అనే వెబ్ సీరీస్ వస్తుంది. టైటిల్ కు తగినట్టుగానే మస్త్ జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ గా ఈ వెబ్ సీరీస్ ఉండేలా ఉంది. నవదీప్ చాందిని చౌదరి జతగా నటించిన ఈ మస్తి వెబ్ సీరీస్ లో షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ చాందిని చౌదరి రెచ్చిపోయిందని తెలుస్తుంది.

షార్ట్ ఫిలింస్ ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న చాందిని చౌదరి సినిమాల్లో మాత్రం సత్తా చాటలేకపోయింది. ఒకటి రెండు సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అందుకే వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టింది అమ్మడు. అయితే సినిమాల్లో రెచ్చిపోలేదు కాని మస్తి వెబ్ సీరీస్ లో మాత్రం లిప్ లాక్స్ తో రెచ్చిపోయిందని తెలుస్తుంది. మొత్తానికి చాందిని ఇలా అయినా కెరియర్ సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుందేమో చూడాలి.

చాందిని వెబ్ సీరీస్ లో ఇలా రెచ్చిపోతే ఇక అలాంటి అడల్ట్ కంటెంట్ సినిమాల్లో ఛాన్స్ వచ్చినా చేసే అవకాశం ఉంది. మరి అమ్మడిలోని ఈ యాంగిల్ ను ఎవరైనా గుర్తించారా లేదో చూడాలి.

Share.