బాలయ్య పేరు చెబితే ఆ హీరోయిన్ మండి పడుతుంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీలో హీరోయిన్ గా కేథ రిన్ త్రెసాని ఎంపిక చేసినట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే వీటిపై ఘాటుగా స్పందించింది కేథరిన్ త్రెసా. మెగా హీరోయిన్ గా పేరు పడిన ఈ హీరోయిన్ నందమూరి హీరోతో నటిస్తుందా అన్న డౌట్ మొదలైంది. అయితే ఇదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్థావిస్తే కేథరిన్ మాత్రం కస్సు బుస్సు అంటుంది.

అసలు తనకు ఆ సినిమా నుండి ఎలాంటి కాల్ రాలేదని.. విషయం తెలుసుకోకుండా మీడియా వాళ్లు ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తున్నారని అని ఫైర్ అవుతుంది కేథరిన్. బాలయ్య బాబు బోయపాటిది సూపర్ కాంబో సింహా, లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ మూవీ కూడా భారీ అంచనాలతో వస్తుంది. మరి ఫాం లో లేని కేథరిన్ కు బాలయ్య పిలిచి ఆఫర్ ఇవ్వడమే గొప్ప విషయం అలాంటిది అమ్మడు ఇలా ఫైర్ అవడంలో అర్ధం లేదని అంటున్నారు.

తెలుగు తమిళంలో ఆఫర్లైతే వస్తున్నా సరే కేథరిన్ కు సరైన గుర్తింపు రావట్లేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోయిన్ గా నటించింది కేథరిన్. వరల్డ్ ఫేమస్ లవర్ లో రౌడీ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకున్న కేథరిన్ ఈ సినిమాతో అయినా క్రేజ్ తెచ్చుకుంటుందో లేదో చూడాలి.

Share.