రోజా ప‌క్క‌న బాల‌య్య‌…. యాక్.. అస‌హ్యం అంటూ వ‌ర్మ పంచ్‌లు..

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ గ‌తేడాది ఎన్నిక‌ల‌కు ముందు నుంచే టీడీపీని, చంద్ర‌బాబు, బాల‌య్య & టీడీపీ నేత‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఏదో ఒక సంద‌ర్భంలో టార్గెట్‌గా చేసుకుని సోష‌ల్ మీడియాలో పంచ్‌లు వేస్తూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా ఏపీ అసెంబ్లీ స‌మావేశాల వేళ అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీ నేత‌ల మ‌ధ్య రాజ‌ధాని మార్పు అంశంపై తీవ్ర‌మైన వాదోపవాదాలు న‌డుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా బుధవారం ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్ఫీ దిగారు.

గ‌తంలో వీరిద్ద‌రు క‌లిసి అనేక సినిమాల్లో జంట‌గా కూడా న‌టించారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇక రోజా – బాల‌య్య సెల్ఫీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై వ‌ర్మ త‌న‌దైన స్టైల్లో కాంట్ర‌వ‌ర్సీగా కామెంట్ చేశాడు. ‘సెల్ఫీలో రోజాగారు హీరోలా కనిపిస్తున్నారు. కానీ ఆమె కుడి పక్కన ఉన్న వ్యక్తి ఎవరో గానీ అసహ్యంగా(యాక్‌)గా ఉన్నారు. ఈ ఫ్రేమ్‌లో అతను రోజా గారి అందాన్ని పాడు చేస్తున్నారు. ఒకవేళ అతను ఆమెకు దిష్టి బొమ్మ కావచ్చు’ అని వర్మ ట్వీట్‌ చేశాడు.

అక్క‌డితో ఆగ‌ని వ‌ర్మ మ‌రో ట్విట్‌లో ‘అందమైన రోజా గారి పక్కన కూర్చుని.. ఆ ఫోటోను నాశనం చేసిన ఆ వ్యక్తి ఎవరో మీరు చెప్పగలరా?’ అని కోరుతూ వర్మ మరో ట్వీట్‌ చేశాడు. ఇక దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. కొంద‌రు వ‌ర్మ‌కు పాజిటివ్‌గా స్పందిస్తుంటే… చాలా మంది మాత్రం వ‌ర్మ‌ను టార్గెట్‌గా చేసుకుని విరుచుకు ప‌డుతున్నారు. బాల‌య్య ఫ్యాన్స్‌, టీడీపీ నేత‌లు మాత్రం వ‌ర్మ‌ను విమ‌ర్శిస్తున్నారు. అదే టైంలో ఆ ఫొటోలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న రోజా కూడా ఉండ‌డంతో వైసీపీ వాళ్లలో కూడా కొంద‌రు వ‌ర్మ నీకేం ప‌నిలేదా ? అని పంచ్‌లు వేస్తున్నారు. ఇక స‌మావేశాల్లో భాగంగా బాల‌య్య ఎదురు ప‌డ‌డంతో
ఆర్కే రోజా మర్యాదపూర్వకంగా పలకరించి, కాసేపు ముచ్చటించారు. అనంతరం రోజాతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు బాలయ్యతో సెల్ఫీలు దిగారు.

Share.