నందమూరి ఫ్యాన్స్ ప్రెస్టిజియస్ గా తీసుకున్న వేళ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం సినిమాల తర్వాత సతీష్ వేగేశ్న డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలో కళ్యాణ్ రాం కు జోడీగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆదిత్య మ్యూజిక్, శివలంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 8వ తారీఖు జరుగనుంది.

సినిమా జనవరి 14న రిలీజ్ అవుతుండగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ గెస్టులుగా వస్తారని తెలుస్తుంది. సంక్రాంతి బరిలో మహేష్ సరిలేరు నీకెవ్వరు. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు వస్తున్నాయి. వీరితో పాటుగా రజినికాంత్ దర్బార్ కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాల మధ్య కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

మంచి కథ కథనాలతో వస్తున్న ఈ సినిమాపై చిత్రయూనిట్ చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే సినిమా నుండి రిలీజైన సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. కళ్యాణ్ రాం సినిమాకు సపోర్ట్ గా నందమూరి ఫ్యాన్స్ ఉండేలా బాలయ్య, తారక్ లు వచ్చి సినిమాను ప్రమోట్ చేసేలా స్కెచ్ వేశారు.

Share.