మ‌ద్యం మ‌త్తులో రోడ్డుపైనే ముద్దులు.. శృతిమించిన న్యూ ఇయ‌ర్ వేడుక‌లు..

Google+ Pinterest LinkedIn Tumblr +

పాత సంవ‌త్స‌రానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టేసాం. ఇక దేశవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌బ్బులు, పార్టీలు, డీజేలు, డ్యాన్సులు, కేక్‌ కట్టింగ్‌ల‌తో హోరెత్తించారు. అయితే బెంగ‌ళూరు మ‌హా న‌గ‌రంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు మ‌రోసారి శ్రుతి మించాయి. మద్యం మత్తులో యువత జోరుగా వేడకలను నిర్వహించారు. కొంతమంది మందుబాబులు న్యూ ఇయర్‌ ఈవెంట్లలో మద్యం తాగి, వేడుకలు ముగిసిన అనంతరం మత్తులో జోగుతూ, తూలుతూ వాహనాలను తోలుతూ.. ఇళ్లకు బయల్దేరారు.

ఇక బెంగ‌ళూరు మ‌హాన‌గ‌రంలో.. ఎంజీ రోడ్డుతో స‌హా .. బార్ల‌కు, ప‌బ్బుల‌కు కొలువైన ప‌లు ప్రాంతాల్లో యువ‌తీయువ‌కులు రోడ్డెక్కి న్యూ ఇయ‌ర్ సంబ‌రాల‌ను చేసుకున్నారు. అయితే మ‌ద్యం మత్తు కీల‌క‌మైన ప్రాంతాల్లో, బార్లు, ప‌బ్బులు ఉండే ప్రాంతాల్లో యువ‌తుల మీద కొంత‌మంది పోకిరీలు వెకిలిగా వ్య‌వ‌హ‌రించారు. మ‌ద్యం మ‌త్తులోని యువ‌కులు కొంద‌రు.. అదే స్థితిలో ఉన్న అమ్మాయిల‌తో రోడ్ల మీద అభ్యంత‌ర‌క‌రంగా ప్ర‌వ‌ర్తించిన దాఖ‌లాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

వారిని తాక‌డం.. కౌగిలించుకునే ప్ర‌య‌త్నాలు, అస‌భ్య క‌రంగా వ్య‌వ‌హ‌రించ‌డం.. ఇలాంటి వ‌న్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి ప‌లు చోట్ల‌. ఆక‌తాయి చేష్ట‌లు ఒక ఎత్తు అయితే, మ‌రి కొంద‌రు మ‌ద్యం మ‌త్తులో రోడ్ల మీదే రొమాన్స్ తో రెచ్చిపోవ‌డం గ‌మ‌నార్హం. బ‌హిరంగ కౌగిలింత‌లు, ముద్దులు న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో కామ‌న్ అయ్యాయి. కొన్ని చోట్ల అలాంటి ఆక‌తాయిల ప‌ట్ల అమ్మాయిలు కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యి చెప్పులతో కొట్టిన సీన్లు రికార్డు అయ్యాయి.

Share.