చిరూకు వార్నింగ్ ఇచ్చిన రాజశేఖర్‌.. ఏం జ‌రిగిందంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మా అసోసియేషన్ వేదికగా మరోసారి చిరంజీవి, రాజశేఖర్ మధ్య ఉన్న విభేదాలు గుప్పుమన్నాయి. మేమంతా ఒక్కటే అని పైకి చెప్పుకుంటున్నా.. లోలోపల మాత్రం చాలా రచ్చ జరుగుతుంది. ఈ అసోసియేషన్‌లో పెద్ద నుంచి చిన్న వరకు అందరు సభ్యులుగా ఉన్నారు. ఈ అసోసియేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి కొంత మంది నటీనటుల మధ్య వివాదాలు కామన్‌గా నడుస్తున్నాయి. ఇక తాజాగా 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ భేధాభిప్రాయాలకు వేదిక అయింది.

ఈ సమావేశంలో మాట్లాడిన చిరంజీవి, సినిమా అసోసియేషన్ ఓ కన్ స్ట్రక్టివ్ గా సాగిపోవాలని, ఏదైనా మంచి జరిగితే, పెద్దగా అరిచి చెప్పాలని, గొడవలు వస్తే, చెవిలో చెప్పుకుని సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. అయితే దీనికి హీరో రాజశేఖర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి తర్వాత రచయిత పరుచూరి గోపాలకృష్ణ మైక్ తీసుకుని మాట్లాడుతుండగానే, ఆయన నుంచి రాజశేఖర్ మైక్ లాక్కున్నంత పనిచేశారు. ఆపై తాను మాట్లాడుతూ, “కలిసి ఉందాం, కలిసి సాగుదాం అంటూ చిరంజీవిగారు బ్రహ్మాండంగా మాట్లాడారు.

ఏవేవో చెబుతుంటారు కానీ, మాలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. నిప్పులేనిదే పొగరాదు, మనందరం హీరోలుగా యాక్ట్ చేస్తున్నాం, కానీ అదే హీరోలుగా రియల్ లైఫ్ లో చేస్తుంటే అణచివేయాలని ప్రయత్నిస్తున్నారు” అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో మా అసోసియేషన్ ఉపాధ్యక్షుడు రాజశేఖర్ తీరుపై అంతా మండిపడుతున్నారు. ముందు నుంచి కూడా ఈయన తీరు ఎవరికీ నచ్చడం లేదు. ఇప్పుడు ఏకంగా చిరంజీవి లాంటి పెద్దవాళ్లు వచ్చినపుడు కూడా ఈయన తీరు మారకపోవడంతో ఒక్కసారిగా మా వేదిక రసాభాస అయిపోయింది.

Share.