మెగా హీరోలకు చిరంజీవి వార్నింగ్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

2019, 2018 మెగా హీరోలకు పెద్దగా కలిసి రాలేదు. వాళ్ళ సినిమాల్లో ఎక్కువ భాగం ఫ్లాపులే. ఒకటి రెండు సినిమాలు మినహా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చినవి పెద్దగా విజయాలు సాధించలేదు. అజ్ఞాతవాసి సినిమా మొదలు మొన్న వచ్చిన ప్రతిరోజు పండగే సినిమా వరకు కూడా ఆ ఫ్యామిలీలో ఎక్కువ ఫ్లాపులే ఉన్నాయి. అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన రంగస్థలం సినిమా విజయం సాధించింది. అల్లు అర్జున్ నటించిన సినిమా నా పేరు సూర్య కూడా ఫ్లాప్ అయింది.

రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమా కూడా ఫ్లాప్ అయింది. చిరంజీవి రెండేళ్ళ తర్వాత తీసుకొచ్చిన సైరా నరసింహా రెడ్డి సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఈ నేపధ్యంలో చిరంజీవి మెగా హీరోలకు పలు కీలక వార్నింగ్ లు ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతీ సినిమా విషయంలో కూడా కథను ప్రధానంగా తీసుకోవడంతో పాటు, ఒక్కరే నిర్ణయం తీసుకోవద్దని, కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలని, డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ కూడా చూడాలని, అసలు ప్రయోగాల జోలికి వెళ్ళే ప్రయత్నం చేయవద్దని,

ప్రయోగం చేసేలా ఉంటే మాత్రం దర్శకుడు హిట్ దర్శకుడు అయితేనే చెయ్యాలని హెచ్చరించారట. హిట్ రేటింగ్ పెరగాలని కూడా చెప్పినట్టు సమాచారం. వసూళ్లు అవే వస్తాయని, వసూళ్ళ గురించి చూడకుండా ముందు సినిమా కథకు ప్రాధాన్యత ఇచ్చి అభిమానులను ఆకట్టుకుంటే వసూళ్లు అవే వస్తాయని చెప్పారట. మల్టీ స్టారర్ సినిమాలకు కూడా దూరంగా ఉంటే మంచిది అని చెప్పినట్టు సమాచార౦. సినిమా పోటీ ఉన్నప్పుడు అసలు విడుదల చేయవద్దని చెప్పారట చిరంజీవి. దీనితో మెగా హీరోలు జాగ్రత్తపడుతున్నారు.

Share.