మోక్షజ్ఞ కోసం రాజమౌళినే అడిగిన బాలకృష్ణ…? అందుకే లేట్…!

0

నందమూరి బాలకృష్ణ నట వారసుడు… మోక్షజ్ఞ సిని రంగ ప్రవేశం పై ఇప్పటి వరకు అనేక పుకార్లు వచ్చాయి. తన కుమారుడి రంగ ప్రవేశం కోసం బాలకృష్ణ పలువురు దర్శకులతో కూడా చర్చలు జరిపినట్టు కూడా ప్రచారం జరిగింది. అన్నీ చర్చల వరకే ఉన్నాయి గాని సినిమా మాత్రం ముందుకి అడుగు పడలేదు. తాజాగా తన కుమారుడి సిని రంగ ప్రవేశంపై బాలకృష్ణ ఒక కీలక ప్రకటన కూడా చేసారు. “చదువుకునే రోజుల్లో వాడి దృష్టి పూర్తిగా చదువు మీదే ఉండేది. ఇప్పుడు సినిమాల గురించి కూడా ఆలోచిస్తున్నాడు.

సినిమాలకు సంబంధించి తన ఆలోచనలను నాతో పంచుకుంటున్నాడు. కచ్చితంగా ఏదో ఒక రోజు మోక్షజ్ఞను వెండితెరపై చూస్తారు. అయితే అదెప్పుడన్నది ఇప్పుడే చెప్పలేనని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. వాస్తవానికి బాలకృష్ణ గత ఏడాది క్రిష్ తో సినిమా చేయించాలి అని భావించారట. కాని అది అంతగా ఫలించకపోవడంతో వెనక్కు తగ్గినట్టు ప్రచారం ఎక్కువగానే జరిగింది. తాజాగా బాలకృష్ణ ఆ ప్రకటన చేయడంతో ఒక వార్త బయటకు వచ్చింది.

రాజమౌళి కోసం బాలకృష్ణ ఆగుతున్నారని అంటున్నారు. ఈ ఏడాది రాజమౌళి తో సినిమా చేయించాలి అని చూసినా సరే అది ఫలించలేదని, అందుకే ఈ ఏడాది కూడా అది సాధ్యం కాలేదని.. ప్రస్తుతం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అవుతుంది. ఆ సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను ముందుకి తీసుకువెళ్ళే ఆలోచన బాలకృష్ణ చేస్తున్నారని, రాజమౌళి బిజీ గా ఉండటమే ఆలస్యానికి కారణమని అంటున్నారు. నిర్మాతగా కూడా తానే ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.

Share.