ప్రయోగాలకు భయపడుతున్న టాలీవుడ్…!

0

భారీ మార్కెట్ ఉన్న టాలివుడ్… ఇప్పుడు ప్రయోగాలకు భయపడుతుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా ఇతర భాషల్లో ప్రయోగాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కడి స్టార్ హీరోలు ఎక్కువగా… ప్రయోగాల మీద దృష్టి సారించి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు. దర్శకులు కూడా ప్రయోగాలకే ఎక్కువగా మొగ్గు చూపుతారు. సల్మాన్, షారూక్, అమీర్, అక్షయ్ కుమార్ ఇలా చాలా మంది స్టార్ హీరోలు ప్రయోగాలు చేసేసారు.

ఇక తమిళంలో సూర్య, విజయ్ సేతుపతి, విజయ్ వంటి యువ హీరోలు కూడా ప్రయోగాలు చేస్తున్నారు… అయితే మన తెలుగులో మాత్రం… ప్రయోగాలు అంటే చాలు భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ ప్రేక్షకులు ఎక్కువగా మాస్ సినిమాలను కోరుకోవడం కూడా ఇబ్బందిగా మారింది. దీనితో హీరోలు ప్రయోగాలు చేయడానికి భయపడుతున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి హీరోలు, పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి అగ్ర హీరోలు కూడా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడటం లేదు.

వెంకటేష్, బాలకృష్ణ, రామ్ చరణ్ వంటి హీరోలు అడపాదడపా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రేక్షకులు అధరించకపోవడంతో ప్రయోగాలు చేయడానికి వెనకడుగు వేస్తున్నారు. ప్రయోగాలు చేయడానికి నిర్మాతలు దర్శకులు సిద్దంగా ఉన్నా…. హీరోలు మాత్ర౦ భయపడే పరిస్థితి ఏర్పడింది. అభిమానులు కూడా నటనలో వైవిధ్యం కోరుకునే పరిస్థితి కూడా తెలుగు సినిమాలో లేదనే విషయం అర్ధమవుతుంది… దీనితో హీరోలు కూడా పెద్దగా సాహసాలు చేయడానికి ఇష్టపడటం లేదు.

Share.