సైరా తర్వాత చిరంజీవి భయపడుతున్నారా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

దాదాపు పదేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉండి… ఖైది నంబర్ 150 తర్వాత రెండేళ్ళు విరామం తీసుకుని మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమా సైరా… ఈ సినిమాపై ముందు నుంచి అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుంది అనే అభిప్రాయాన్ని సిని పరిశీలకులు కూడా వ్యక్తం చేసారు. చిరంజీవి కూడా ఈ సినిమా కోసం కాస్త ఎక్కువగా కష్టపడ్డారు. ఇతర సినిమాల కథలు తీసుకుని వస్తున్నా సరే అందుకు చిరు ఆసక్తి చూపించకుండా సైరా మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.

అయితే ఈ సినిమా మాత్రం ఆయనకు ఆశించిన విధంగా ఫలితం ఇవ్వకపోవడంతో చిరు షాక్ అయ్యారు. అటు నిర్మాత రామ్ చరణ్ కి కూడా ఈ సినిమా భారీ నష్టాలే మిగిల్చింది అంటున్నారు. దీనితో ఇప్పుడు చిరు భయపడుతున్నట్టు తెలుస్తుంది. తనను ఎక్కువగా ప్రేక్షకులు మాస్ పాత్రలే కోరుకుంటారని భావిస్తున్న చిరంజీవి… అందుకు తగిన విధంగానే కథలు అడుగుతున్నారట.. ప్రస్తుతం ఆయన నటించిన సినిమాలో పాత్రలో కాస్త భిన్న౦గా ఉంటుందని, అది ఎక్కువ సేపు ఉండదు అని దర్శకుడు చెప్పారట.

దానికి చిరూ నో అన్నారట… తాను ఎలాంటి ప్రయోగాలు చేసేది లేదని స్పషంగా చెప్పారట. అవసరమైతే ఆ పాత్రను మార్చాలని తాను చేసేది లేదని చెప్పారట. సినిమాలో ఎలాంటి ప్రయోగాలు ఉండొద్దని కూడా స్పష్టంగా చెప్పారట. ఆయనతో ఇటీవల ఒక దర్శకుడు సినిమా చేయడానికి వచ్చిన సందర్భంలో కూడా ఇదే విషయాన్ని చిరు చెప్పినట్టు సమాచారం. ఎక్కువగా సమయం వృధా చేయవద్దని, తనను మాస్ లుక్ లో చూడటానికే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు కాబట్టి అలాగే చూపించమని అంటున్నారట.

Share.