వినూత్నంగా ఆకట్టుకుంటున్న ‘మత్తు వదలరా’ ట్రైలర్..

Google+ Pinterest LinkedIn Tumblr +

సంగీత దిగ్గజం కీరవాణి తనయుడు శ్రీసింహా కథానాయకుడిగా అరంగేట్రం చేస్తున్న చిత్రం `మత్తు వదలరా`. రితేష్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మాతలు. కీరవాణి పెద్ద కుమారుడు కాలభైరవ స్వరాల్ని అందిస్తున్నారు. ఈ నెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక తాజ‌గా తాజగా ఈ చిత్రం ట్రైలర్ ను రానా విడుదల చేశారు. ట్రైలర్ లో మెయిన్ కాన్సెప్ట్ తో పాటు ప్రధాన పాత్రలను.. ఆ పాత్రల మధ్య సంఘర్షణను బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ఆత్రుత, అసహనం, కోపం కలబోసిన భిన్న మనో మనస్తత్వం వున్న కథానాయకుడిగా రెండు గెటప్స్ తో శ్రీ సింహా ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాడు. ముఖ్యంగా శ్రీసింహా- సత్యల మధ్య వచ్చే సీన్స్ సినిమాలో బాగా అలరిస్తాయని అనిపిస్తోంది. మొత్తానికి సినిమా ట్రైలర్ ఇంట్రస్టింగ్ గా ఉండ‌డంతో వినూత్నంగా ఆక‌ట్టుకుంటోంది.

కాగా, నరేష్ ఆగస్త్య, అతల్య చంద్ర, సత్య, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ..సురేష్ సారంగం. దాదాపు ఎక్కువ శాతం కొత్తవాళ్లు పనిచేయనున్న ఈ సినిమాకు టైటిల్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. రీసెంట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘మత్తు వదలరా’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయ‌డంతో మంచి రెస్పోన్స్ వ‌చ్చింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉండ‌బోతుందో ఈ నెల 25 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

Share.