స్టెప్పులుతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న బాలయ్య..

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్న హీరో ఎవరైనా ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే ..డిసెంబర్ 20న ఆయన నటించిన రూలర్ చిత్రం విడుదల కానుంది. ఇక ఈ చిత్రం నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ ఓ ట్రెండింగ్ సృష్టిస్తుంది. ఇటీవలే సినిమా నుంచి విడుదలైన రెండు ట్రైలర్లకు అదిరిపోయే స్పందన వస్తుంది. అలాగే సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులని బాగా విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇందులో ‘పడతాడు పడతాడు ‘ అనే పాటకు విశేష స్పందన వచ్చింది.

ఇక పాటకు సంబంధించిన ప్రోమో ఒకటి తాజాగా విడుదలైంది. ఇందులో బాలయ్య డ్యాన్స్ అదరగొట్టేసాడు. 59 సంవత్సరాల వయసు లో కూడా అదిరిపోయే స్టెప్పులు వేసి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇందులో జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ప్రతి స్టెప్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ పాట మొత్తం థియేటర్ లో చూస్తే అభిమానులకు కనుల విందు కావడం ఖాయం.

అయితే వీరిద్దరూ కాంబినేషన్ లో వచ్చిన జై సింహలోని ‘అమ్మకుట్టి’ పాట ఏ విధంగా ప్రేక్షకులని అలరించిందో తెలిసిందే. ఇందులో ప్రతి స్టెప్ అదిరిపోయేలా వేసాడు బాలయ్య. ఇక సాంగ్ వలనే సినిమాకు చాలా ప్లస్ అయింది. కేవలం ఈ పాట చూడటం కోసమని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. మరి ఇప్పుడు ‘రూలర్’ లో ‘పడతాడు’ అనే పాట ఏ విధంగా ట్రెండ్ సెట్ చేస్తుందో చూడాలి.

Share.