వెంకీ మామ ఫ‌స్ట్ డే కలెక్షన్స్… చైతు, వెంకీ కెరీర్ రికార్డ్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

నిజ జీవితంలో మేన‌మామ‌, మేన‌ళ్లుడు అయిన విక్ట‌రీ వెంకటేష్, నాగ చైతన్య క‌లిసి వెండి తెర మీద కూడా అదే క్యారెక్ట‌ర్ల‌లో న‌టించిన సినిమా వెంకీ మామ‌. మిక్స్ డ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను సాధిస్తోంది. దగ్గుబాటి, అక్కినేని అభిమానులు ఈ సినిమాను బాగా ఆదరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాక్‌తో సంబంధం లేకుండా రు 7.02 కోట్ల షేర్ రాబ‌ట్టింది.

అటు వెంకీ, ఇటు చైతుకు కెరీర్‌లోనే ఫ‌స్ట్ డే ఏ సినిమాకు కూడా రు.5 కోట్ల షేర్ రాలేదు. అలాంటిది ఈ సినిమా వీరు రికార్డు బ‌ద్ద‌లు కొట్టార‌నే చెప్పాలి. వెంకీ మరియు చైతు ఇద్దరికీ ఈ సినిమాతో కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. కాగా ఏపి & తెలంగాణ లో ఈ సినిమాకి మొదటి రోజు 7.02 కోట్ల రూపాయల థియేటర్ షేర్ వచ్చింది.

అయితే రు.36 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా మ‌రి తొలి వారంలో ఈ టాక్‌తో ఏ తీరాల‌కు చేరుతుందో ? చూడాలి. వ‌చ్చే వారం ఏకంగా మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. వెంకీ మామ ఫ‌స్ట్ డే ఏరియా వైజ్ వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

నైజాం – 2.29 కోట్లు

సీడెడ్ – 1.60 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.87 కోట్లు

ఈస్ట్ – 0.60 కోట్లు

వెస్ట్ – 0.30 కోట్లు

కృష్ణ – 0.37 కోట్లు

గుంటూరు – 0.72 కోట్లు

నెల్లూరు – 0.27 కోట్లు
—————————————————————-
ఏపి & తెలంగాణ మొదటి రోజు షేర్ = 7 .02 కోట్లు
—————————————————————-

Share.