కొమ‌రం భీం వీడియో లీక్‌ పై ఎన్టీఆర్ ఘాటు స్పందన…

Google+ Pinterest LinkedIn Tumblr +

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చెయ్యాడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో కీలక సన్నివేశాలకు సంబంధించి షూటింగ్ జరుగుతుంది. ఇక రాజమౌళి కూడా ఈ సినిమా విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఖర్చు విషయంలో కూడా ఆయన ఎక్కడా రాజి పడటం లేదని సిని వర్గాలు అంటున్నాయి.

అటు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేక దృష్టి పెట్టి ఇతర కథలను కూడా వినడం లేదట. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఎన్టీఆర్ కొమరం భీం పాత్రకు సంబంధించి చిత్రీకరణ జరుగుతుండగా ఎవరో మొబైల్ లో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ఎన్టీఆర్ అభిమానులు దీనిని ఎక్కువగా షేర్ చేయడంతో ఇది వార్తల్లో కూడా నిలిచింది. అయితే దీనిపై ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

సినిమా మీద అభిమానులకు, ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఉంటాయని, తాము కూడా సినిమా విషయంలో ఎంతో శ్రద్ధ గా ఉండి భారీగా ఖర్చు పెట్టి సినిమాలు తీస్తామని… ఇలా వీడియోలు విడుదల చేస్తే అభిమానుల్లో క్రేజ్ తగ్గిపోతుందని అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇలాంటి చేష్టలతో తమలో కూడా సీరియస్ నెస్ పోతుందని సినిమా యూనిట్ ముందు ఆగ్రహం వ్యక్తం చేసాడట. ఇక షూటింగ్ సమయంలో ఎవరూ కూడా మొబైల్ వాడొద్దని సూచిస్తున్నాడట. ఇప్పటికే రాజమౌళికి ఈ విషయాన్ని ఎన్టీఆర్ చెప్పాడట. రాజమౌళి కూడా చిత్ర యూనిట్ కి సుతి మెత్త‌ని వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం.

Share.