వెంకీ మామ పబ్లిక్ టాక్.. హిట్టా ఫట్టా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ వెంకీమామ. ఈ సినిమాను బాబి డైరెక్ట్ చేయగా సురేష్ బాబు నిర్మించారు. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్ లో కూడా తమ పాత్రల్లో నటిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే చెప్పొచ్చు. ఇక సినిమాలో ఎంత చైతుకి స్కోప్ ఇచ్చినా వెంకటేష్ పాత్రే హైలెట్ అవుతూ వచ్చింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుందని చెప్పొచ్చు.

సినిమాలో వెంకటేష్ నటనకు ఫిదా అవుతారట. చైతు కూడా ఇంప్రెస్ చేశాడని తెలుస్తుంది. రాశి ఖన్నా, పయాల్ రాజ్ పుత్ స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నా ఉన్నంతలో బాగానే చేశారు. పాయల్ రాజ్ పుత్ ఒక పాటలో తన ఫ్యాన్స్ ను అలరించింది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ ఎంటర్టైనింగ్ తో సాగించగా సెకండ్ హాఫ్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది.

అక్కడే సినిమాకు దెబ్బ పడ్డదని తెలుస్తుంది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం దారుణంగా ఉందని అంటున్నారు. సెకండ్ హాఫ్ కామెడీ మిస్ అవగా సినిమా కథను ఎక్కడి నుండి ఎక్కడికో తీసుకెళ్లాడనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా కూడా ల్యాగ్ అయినట్టు ఉంటుంది. మొత్తానికి వెంకీ ఫ్యాన్స్ తో పాటుగా అక్కినేని అభిమానులకు మాత్రమే నచ్చే సినిమా వెంకీమామ అంటున్నారు.

Share.