క్రికెట్ ఆడలేడుగాని హీరోయిన్ తో డేటింగ్ చేస్తాడా…? క్రికెటర్ పై ఫాన్స్ ఫైర్…!

Google+ Pinterest LinkedIn Tumblr +

రిషబ్ పంత్… టీం ఇండియా యువ ఆటగాడు… ధోని స్థానంలో టీం లోకి వచ్చిన ఈ యువ ఆటగాడు… ఎప్పుడో ఒకసారి మినహా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సరే వరుసగా వికెట్లు కోల్పోతున్నాడు. ఐపిఎల్ లో మినహా పెద్దగా ఆకట్టుకోలేదు. గత ఏడాది ఇంగ్లాండ్, ఆసిస్ సీరీస్ లో కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో కూడా పంత్ ఆకట్టుకున్నాడు. అయితే టి20 లలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్ కోహ్లి అవకాశాలు ఇచ్చినా సరే నిరూపించుకోకపోవడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల విండీస్ తో జరిగిన మూడు టి20 ల సీరీస్ లో కూడా పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోవడం తో అతన్ని టీం నుంచి తప్పించాలి అనే డిమాండ్లు వినపడుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ కి అతను ఫిట్ కాదు అంటూ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం గంగూలీ వలనే అతను టీం లో ఉంటున్నాడు అని అతని స్థానంలో చాలా మంది ఆటగాళ్ళు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళను టీం లోకి తీసుకోండి అని సూచిస్తున్నారు. అయితే తాజాగా అతని గురించి ఒక వార్త బయటకు వచ్చింది.

బాలివుడ్ నటి ఊర్వశి రౌతాలా తో అతను డేటింగ్ చేస్తున్నాడు అనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది. విరామం దొరికిన ప్రతీ సారి తన కార్ లో ఆమెతో కలిసి ఈ కుర్ర క్రికెటర్ చక్కర్లు కొడుతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై అభిమానులు కస్సు మంటున్నారు… క్రికెట్ ఆడలేవు… వచ్చిన అవకాశాలు వినియోగించుకోవడం రాదూ… పైగా నీకు గర్ల్ ఫ్రెండ్ కావాలి… నువ్వు మళ్ళీ ధోని వారసుడు అంటూ కీర్తించడం… ఏంటి మాకు ఇది అంటూ పలువురు అభిమానులు పంత్, రౌతాలా ఫోటోలు పెట్టి విమర్శలు చేస్తున్నారు.

Share.