చాణక్య ట్విట్ట‌ర్ రివ్యూ…!

Google+ Pinterest LinkedIn Tumblr +

యాక్ష‌న్ హీరో గోపీచంద్ న‌టించిన చిత్రం చాణక్య‌.. ఈరోజు ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల ముందుకు ఈ రోజు వ‌స్తుంది. అయితే ఇప్ప‌టికే ఈ చిత్రం యూఎస్‌లో ప్రిమియ‌ర్ షోలు పూర్తి అయ్యాయి. అయితే ఈ సినిమా ఎలా ఉందో.. గోపీచంద్ న‌ట‌న‌, హీరోయిన్ల రొమాన్స్‌, సినిమా సాంకేతిక వ‌ర్గం ప‌నితీరుపై అప్పుడే ట్విట్ట‌ర్ రివ్యూలు వ‌చ్చేసాయి…

అమెరికాలో చాణ‌క్య సినిమా ప్రిమియ‌ర్ షో చూసిన ప్రేక్ష‌కులు నుంచి మంచి పాజిటివ్ టాక్ వినిపిస్తున్నారు. గోపీచంద్‌కు ఇప్ప‌టికే వ‌రుస ప‌రాజ‌యాల‌తో చ‌తికిల ప‌డ్డారు. గోపీచంద్‌కు ఆక్సీజ‌న్ ఆక్సిజ‌న్ అందించేక‌పోయింది.. అర‌డుగుల బుల్లెట్‌, పంతం సినిమాలు కూడా ఆదుకోలేక పోయాయి. ఇక గోపీచంద్ చాణ‌క్య మీద ఆశ‌లు పెట్టుకుని ముందుకు సాగాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రిమియ‌ర్ షోతో త‌న ఆశ‌లు స‌జీవం అయ్యాయి.

సీనియ‌ర్ న‌టుడు నాజ‌ర్ ఓ రా ఆఫీస‌ర్‌గా ఆయ‌న ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ప‌నిచేసే గూడాచారిగా రెండు పాత్ర‌లో గోపీచంద్ న‌ట‌న ఆక‌ట్టుకుంద‌ట‌… ఇక ఈ సినిమాకు ఎక్క‌డ బోర్ లేకుండా, సాఫీగా సాగింద‌ట‌. గోపీచంద్ న‌ట‌న సినిమాకు హైలెట్ ఆట‌.. ఇక బాలీవుడ్ బామ జ‌రీన్‌ఖాన్‌, మెహ‌రీన్ న‌ట‌న సూప‌ర్‌గా ఉంద‌ట‌. ఇక సంగీత ద‌ర్శ‌కుడు అందించిన బ్రాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంద‌ట‌నే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి సినిమా మొద‌టి 15నిమిషాలు స్లోగా అనిపించినా మిగ‌తా భాగ‌మంతా సినిమా సాఫీగా సాగింద‌ట‌.. ప్రిమియ‌ర్ షో ట్విట్ట‌ర్ రివ్యూలు సినిమాకు ప్ల‌స్ అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి..

Share.